అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ శ్రీనివాస శాంతి కళ్యాణ మహోత్సవం
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : అలియాబాద్ పూల్ బాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తజనుల మధ్య శ్రీనివాసుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయాన్ని పూలతో అలంకరించి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ శ్రీ పద్మావతి, అలివేలు మంగ సమేత శ్రీనివాసుని శాంతి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. అనంతరం మూలకుంభ ఆరాధన, సుదర్శన నరసింహ హోమం నిర్వహించి వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించగా, భక్తులు తులాభారం సేవల్లో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు...