MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 8:56 pm Posted by : MANA TOLIVELUGU

అద్భుతం.. మర్రి చెట్టు పై విగ్నేశ్వరుని రూపం 

చీకటి వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో మఱ్ఱి చెట్టుపై ఏకదంతుడి దర్శనం 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

దేవుడు తనను తాను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఈ భూలోకం మీద కొన్ని అద్భుతాలు చేస్తుంటాడు. అలాంటి అద్భుతమే కందుకూరు మండలం పులిమామిడి గ్రామం లోని చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. మర్రి చెట్టు పైన విగ్నేశ్వరుడి రూపం అవతరించింది. కందుకూరు మండల పరిధిలోని ఎన్టీఆర్ నగర్ తండాకు చెందిన రెడ్డి నాయక్ అనే వ్యక్తికి గురువారం రాత్రి కలలో మర్రి చెట్టుపై విఘ్నేశ్వరుడు రూపం వెలిసినట్టు కళ వచ్చింది. శుక్రవారం అక్కడికి వెళ్లి చూడగా రూపం స్పష్టంగా కనిపించింది. ఆయన ఆ మర్రి చెట్టుకు పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి రూపం, తొండం, ఏకదంతం చక్కగా ఆ మర్రిచెట్టు పైన కనిపిస్తున్నాయి.

వాస్తవానికి పులిమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం భూములు 240 ఎకరాలు. అయితే ఈ భూమిని కొన్ని వందల సంవత్సరాలుగా ఆలయ కమిటీ ట్రస్టు ఆధ్వర్యంలో కాపాడుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆ భూములను ప్రైవేటు వ్యక్తులు కు దారాదత్తం చేయాలని పూనుకున్నారు. అక్కడ దేవాలయ భూములు కబ్జాకి కూడా గురి కావడం జరిగింది. ఇంకా ఇలాగే ఉంటే ఉన్న భూమి మొత్తము ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో వెళ్లే అవకాశం ఉంది. కావున భగవంతుడు తన ఉనికిని, తన ఆస్తులను తనే కాపాడుకునే విధంగా ఆలయ ప్రాంగణంలోనే ఒక మర్రి చెట్టు పైన విగ్నేశ్వరుడిగా వెలిసాడని ప్రజలు అనుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న కందుకూరు మండలం, మహేశ్వరం మండలంలోని గ్రామాల ప్రజలు హిందూ బంధువులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బజరంగ్ ధళ్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు, దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున వచ్చి పులిమామిడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.