అద్భుతం.. మర్రి చెట్టు పై విగ్నేశ్వరుని రూపం 

చీకటి వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో మఱ్ఱి చెట్టుపై ఏకదంతుడి దర్శనం  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : దేవుడు తనను తాను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఈ భూలోకం మీద కొన్ని అద్భుతాలు చేస్తుంటాడు. అలాంటి అద్భుతమే కందుకూరు మండలం పులిమామిడి గ్రామం లోని చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. మర్రి చెట్టు పైన విగ్నేశ్వరుడి రూపం అవతరించింది. కందుకూరు మండల పరిధిలోని ఎన్టీఆర్ నగర్ తండాకు చెందిన రెడ్డి నాయక్ అనే వ్యక్తికి గురువారం రాత్రి కలలో...