మన తొలివెలుగు మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి ఎన్. హరీష్ (30 జూలై 2026) :
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బొల్లె చిన్న లక్ష్మయ్య, కమ్మరి రాఘవచారి, పిల్లెల్ల రాములు కుటుంబాలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ‘మేఘన్న అభయహస్తం’ ద్వారా రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరశురామ్ యాదవ్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.