పట్టించుకోని జల్ పల్లి సర్కిల్ అధికారులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జల్ పల్లి డివిజన్ శ్రీరామ కాలనీలో కొన్నిచోట్ల మురుగు నీరు, ప్రధాన రహదారులపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. ఆ నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పారిశుధ్యం అధ్వాన్నంగా మారడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిపాలన అందించాల్సిన అధికారులు పారిశుధ్యం విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు అధికంగా కట్టేది జల్ పల్లి , శ్రీరామ కాలనీ వాసులు. కానీ జల్ పల్లి సర్కిల్ అధికారులు అధికంగా పనులు కట్టే ప్రాంతాన్ని విస్మరించి , పన్నులు తక్కువగా కట్టే షాహీన్ నగర్ లాంటి ప్రాంతాలలో అభివృద్ధిని చేయిస్తున్నారు. ఇది ఎంత వరకు న్యాయమని శ్రీరామ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జల్ పల్లి ,శ్రీరామ కాలనీలో ప్రధాన సమస్యలైనా జల్ పల్లి కమాన్ రోడ్, మరాఠ భవన్ రోడ్, శ్రీరామ కాలనీ ప్రధాన రహదారి, శ్రీరామ కాలనీలో డ్రైనేజీ, పార్కు అభివృద్ధి పనులు, జిమ్ములు, చిల్డ్రన్స్ పార్కులు, జల్ పల్లి పెద్ద చెరువు కట్ట అభివృద్ధి, తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మాణాలు చేసి ఇంటింటికి నీటిని సరఫరా చేయించి నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చేస్తున్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగడంలేదని అభివృద్ధి శూన్యం అని కాలనీవాసులు పేర్కొన్నారు. ఇకనైనా కాలనీలో సమస్యలు లేకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకొని ప్రధాన సమస్యలైన డ్రైనేజీ రోడ్డు సమస్యలకు నిధులు కేటాయింప చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జల్ పల్లి , శ్రీరామ కాలనీ లో జల్ పల్లి డివిజన్ కమిషనర్ వెంకట్రావు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు.

జీహెచ్ఎంసీ పరిధి జల్పల్లి డివిజన్ పరిధిలోని జల్ పల్లి, శ్రీరామ కాలనీలో అధికారుల పాలన వల్ల అభివృద్ధి ఆగిపోయిందని మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, ఏడాది కాలంలో ఎలాంటి ప్రగతి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి నోచుకోవడం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం జల్పల్లి, శ్రీరామ కాలనీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహకారంతో సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి తప్ప మరి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇప్పటివరకు ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. అభివృద్ధి శూన్యం. జల్ పల్లి , శ్రీరామ కాలనీ లో అభివృద్ధిని జల్ పల్లి డివిజన్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు అభివృద్ధి ని పూర్తిగా విస్మరించారు. అధికారులు నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మురుగు నీరుతో కొన్ని బస్తీల రహదారులు చిత్తడి చిత్తడిగా మారాయి. పట్టించుకున్న వారు కరువయ్యారు. దోమలు విజృంభిస్తున్నాయి. అవి కుట్టడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. మురుగు సమస్యతో పాటు తదితర సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం కమిషన్ వెంకట్రావుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, కలిసి చెప్పినా స్పందించడం లేదు. టాక్స్ లు కట్టేది ఇక్కడ అభివృద్ధి చేసేది వేరే ప్రాంతంలోనా ఇదెక్కడి అన్యాయం అని ఆయన ప్రశ్నించారు. త్వరలో సమస్యలు పరిష్కరించకపోతే శంషాబాద్ ప్రధాన కార్యాలయంలో కాలనీ వాసులతో కలిసి ధర్నా చేపడతామని, డిప్యూటీ కమిషనర్ వెంకటరావు పై జోన్ కమిషనర్ చంద్రకళకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.