MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 8:02 pm Posted by : MANA TOLIVELUGU

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి 

 ఎంపీ ఈటెల రాజేందర్ కు వినతి పత్రం అందజేసిన కొలన్ శంకర్ రెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :

ఎంపీ ఈటల రాజేందర్ ని షామీర్ పేటలోని వారి స్వగ్రహంలో బీజేపీ రాష్ట్ర కో- ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దాతునగర్, ఆఫీసర్స్ కాలనీ, సుభాష్ సుభాష్ చంద్రబోస్ నగర్ లోని గుంతలుగా రోడ్డు, పార్క్ లో గణేష్ నవరాత్రుల నిర్వహణకు కోసం షెడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమములో బీజేపీ నేతలు సత్యప్రకాష్ సింగ్, గంగారాం సురేష్, ఎడ్ల మల్లేష్ , ఎం. జయకాంత, దినేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.