MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 5:23 pm Posted by : MANA TOLIVELUGU

అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

సీసీ రోడ్డు అభివృద్ధి పనులను సదర్ కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ మీర్పేట్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో రూ.11 లక్షల 65 వేల వ్యయంతో, 110 మీటర్ల పొడవుతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు .చేపడుతున్న పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దీప్లాల్ చౌహాన్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, దిండు భూపేష్ గౌడ్, సిద్దాల అంజయ్య, బిందు, లత, డీఈ హరిని, ఏఈ సౌమ్య, వర్క్ ఇన్స్పెక్టర్ స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.