MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 9:10 pm Posted by : MANA TOLIVELUGU

అభివృద్ధి లక్ష్యంగా జనరంజక పాలన సాగిస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

మంచి మనసున్న మహోన్నత వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

సబితా ఇంద్రారెడ్డి అంటేనే అభివృద్ధి, మహేశ్వరం , చేవెళ్ల నియోజకవర్గం ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మంచి మనసున్న మహోన్నత వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ మహేందర్ రెడ్డి అన్నారు. మే 5 న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా ముందస్తుగా అనిత సామ మహేందర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేని కలిసి పుష్ప గుచ్చం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబితమ్మ పేరు వినగానే సేవ గుర్తుకు వస్తుందన్నారు. సమస్య ఉందని తెలిస్తే చాలు క్షేత్రస్థాయిలో పర్యటించి తీవ్రమైన సమస్య ఉంటే వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయిస్తారన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజల మధ్యనే గడిపే ఏకైక మహిళా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి మాత్రమే అన్నారు. ప్రజల కోసం పలికే మాట, ప్రజల కోసం నడిచే బాట ఆమెనే సబితా ఇంద్రారెడ్డి అని పేర్కొన్నారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.