- మన తొలివెలుగు ప్రతినిధి ముత్తయ్య
జల్ పల్లి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆప్తులు , స్నేహితులు రాజకీయ నాయకులతో కలిసి బుధవారం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. హోమం చేశారు. ఈ శుభ సందర్భంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విచ్చేసి కుటుంబ సభ్యులకు అర్జున్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

అర్జున్ నిర్మించుకున్న అందమైన నివాసంలో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరెడ్డి క్రిష్ణారెడ్డి, కైసర్ బాం, యంజాల జనార్దన్, పల్లపు శంకర్ , సైయీద్ పటేల్ , కొంగర సుభాష్, మారుతి , సయ్యద్ ఇద్రీస్, సోషల్ మీడియా వారియర్ వాసు బాబు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సయ్యద్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.