ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో జిల్లా బ్యూరో: రేవల్లి మండలంలోని తలుపునూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి స్థానిక మసీద్ కమిటీ సభ్యులు రూ.25 వేలు విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటారు. మతాలు వేరైనా తామంతా ఒక్కటేనని మసీద్ కమిటీ అధ్యక్షుడు ఎండి జలీల్ తెలిపారు. ముస్లిం సోదరుల ఉదారత గ్రామంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు నరసింహ, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ పురప్రముఖులు, ఆలయ, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.