ఆగిపోయిన ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను వేగవంతంగా వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఎస్‌ఎన్‌డీపీ నాలాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యవేషించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలా అభివృద్ధి పనులు ఎందుకు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తున్న...