ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్న దీపక్ (13) విద్యార్థి వేసవి సెలవుల కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 3న ఉదయం సుమారు 8 గంటలకు సింగానియా కంపెనీలో తల్లి వీరమని పనికి వెళ్లింది, ఆ సమయంలో ఆమె చిన్న...