MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 8:48 pm Posted by : MANA TOLIVELUGU

ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు

తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచందర్ రావు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

దానాలన్నింటిలోనూ రక్తదానమే మిన్న ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లెలగూడ డివిజన్ శక్తి నగర్‌లో బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు, అందెల శ్రీరాములు మాట్లాడుతూ రక్తదానం అనేది మానవాళికి మనం చేయగల అత్యున్నత సేవ అని మనం చేసే రక్తదానం.. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్న వారికి, మరీ ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కొత్త ఆశను, బలాన్ని, ప్రాణదానాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు. నేటితరం యువత పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ , మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.