ఆసరా పింఛన్ల కు లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి 

తహసీల్దార్ కే బాలశంకర్ మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్  బహదూర్‌పురా మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆసరా పింఛన్ల లైవ్ అథెంటికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, పింఛన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారా లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్న వారికే వచ్చే నెల నుంచి ఆసరా పింఛన్లు యథావిధిగా జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎండను లెక్కచేయకుండా కర్రల సాయంతో, వీల్ చైర్లలో వృద్ధులు, దివ్యాంగులు తరలివచ్చారు....