MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:59 pm Posted by : MANA TOLIVELUGU

ఇంటింటికీ ఎన్యుమరేషన్ దరఖాస్తుల పంపిణీ

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసు కుని ఓటు హక్కును వినియో గించుకోవాలని జల్ పల్లి సర్కిల్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ షేక్ జహంగీర్, పార్టీ సీనియర్ నాయకుడు యంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు నిర్వ హిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ ప్రతినిధితో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ దరఖాస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఓటర్లకు ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్యు మరేషన్ ఫారాలను సక్రమంగా నింపి సంబంధిత అధికారులకు అంద జేయాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి అర్హుడైన ఓటర్ ఓటర్ జాబితాలో నమోదు చేయించాలని కోరారు. డూప్లికేట్, మల్టీ ఫుల్ ,మరణించిన వారు, బోగస్ ఓటర్లను గుర్తించి ఓటర్ జాబితా నుండి తొలగించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ లు విజయలక్ష్మి, జ్యోతి , బీఎల్ఏలు సయ్యద్ నవాజ్, దూడల శివ గౌడ్, గొరిగే శ్రీకాంత్ పాల్గొన్నారు.