MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:55 pm Posted by : MANA TOLIVELUGU

ఇంటి నుంచి బయట వెళ్లిన మహిళ అదృశ్యం 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ఇంట్లో సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సోహెల్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీ లో నివాసం ఉండే షహీన్ బేగం ( 42) గృహిణి. ఈ నెల 7 న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగిరాలేదు. ఆమె భర్త వసీముల్లా ఖాన్ బంధువుల దగ్గర చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిక్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.