MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:20 pm Posted by : MANA TOLIVELUGU

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

మహిళలకు అందజేసిన మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :

మేడ్చల్ జిల్లా రోడా మేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయ మహిళా సంఘాల సభ్యులకు అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత మరియు ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయ సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, సబ్సిడీపై ఆర్టీసీ బస్సుల కల్పన వంటి పథకాల ద్వారా వారి ఆర్థిక పురోగతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు రమణి, నిర్మల, మంజుల, కౌసల్యతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, మధుసూదన్, రఘు రెడ్డి, వెంకటేష్, బాలకృష్ణ, బలరాం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు .