ఇరుముడి చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలి 

మైనర్ బాలికను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు..! “ఇరుముడి” చిత్రంపై బాలల హక్కుల కమిషన్‌కు న్యాయవాది మహేష్ బాబు చోల్లేటి ఫిర్యాదు మన తొలివెలుగు | ఎల్బీనగర్ : తెలుగు చిత్రం ఇరుముడిలో మైనర్ బాలికను ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారంటూ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (టీఎస్సీపీసీఆర్)కు జై లోక్ సత్తా (సోషల్ జస్టిస్ ఫోరం) ఫౌండర్ ప్రెసిడెంట్, న్యాయవాది మహేష్ బాబు చోల్లేటి ఫిర్యాదు చేశారు. సినిమాలోని ఓ సన్నివేశంలో ఒక పాత్రధారి మైనర్ బాలికను ఉద్దేశించి “ముదురు ముండ”...