కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంట్లో ఈడి సోదాలను వ్యతిరేకిస్తూ సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన
మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎల్డీఎఫ్ నాయకుల ఇండ్లపై ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ సీఐటీయు కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు బీజేపీ ఉపయోగించే ప్రభుత్వ జేబు సంస్థలైనటువంటి ఈడి. సీబీఐ లాంటి వాటిని కేరళ రాష్ట్రంలో ప్రతిపక్షం పై ఉపయోగించడానికి యూడీఎఫ్ ప్రభుత్వం కూడా బీజేపీతో చేతులు కలిపిందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు, కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలను ప్రజలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

ఈ చర్యలు రాజకీయ కక్షసాధింపులో భాగంగా భారీ సన్నాహాలతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రహస్యంగా సోదాలు ప్రారంభించారనీ, తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసం, కన్నూర్‌లోని ఆయన కుటుంబ నివాసంలో ఏకకాలంలో సోదాలు జరిగాయని, ఈడీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ దాడులను పునఃప్రారంభించారనీ బేపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ.ఎ. మహమ్మద్ రియాస్‌కు చెందిన కోజికోడ్‌లోని ఇంట్లో కూడా ఈడీ బృందం సోదాలు నిర్వహించిందని, ఇలాంటి చర్యలు పినరయి విజయన్‌ను గానీ, సీపీఎం పార్టీని గానీ ఏమి చేయలేవని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుని ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టడానికి కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం తో జత కలిసి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర కలయికతో కేరళలో సీపీఎం నాయకులను ఇబ్బందులకు గురి చేస్తే దేశంలో ఉన్న వామపక్షా లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై కేంద్రంలో బీజేపీ, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను తిప్పికొడతామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు పసుల అంజయ్య, రావుల స్వాతి, ఈ. దేవదానం, కరుణాకర్, కే శీను, తిమ్మప్ప, దుర్గా నాయక్ మల్లారెడ్డి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.