బాచుపల్లి మండల సిఐటీయూ కన్వీనర్ రాథోడ్ సంతోష్ పిలుపు
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
ఈనెల 9న సైబరాబాద్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని బాచుపల్లి మండల సీఐటీయూ కన్వీనర్ రాథోడ్ సంతోష్ పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది అని తెలిపారు. ఈ సందర్బంగా రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకించాలన్నారు. మున్సిపల్ కార్మికులందరిని పర్మినేంట్ చేయాలని, కనీస వేతనం రూ.26,000/లు అమలు చేయాలని, సైబరాబాద్ కార్పొరేషన్లలో పని చేస్తున్న కార్మికులందరికి జీహెచ్ఎంసీలో చెల్లిస్తున్న వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన మున్సిపల్ కార్మికులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, 60 ఏళ్ల వయస్సు పైబడిన కార్మికులను తొలగిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి రిటైర్మెంట్ బెన్ఫిట్ రూ. 10 లక్షలు, వారసులు లేని వారికి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు రూ.30,000/-లు మట్టి ఖర్చులతో పాటు ఆదివారాలు, పండుగ సెలవులు, వారాంతపు సెలవులు, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడు కార్పొరేషన్ల పరిధిలోని ఎస్.ఎఫ్.ఎ.లకు, జవాన్లకు వర్క్ ఇనిస్పెక్టర్లకు ప్రమోషన్లు కల్పించడం తో పాటు మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతనిచ్చి డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, బయోమెట్రిక్ అటెండెంన్స్ విధానంలో మార్పులు చేయాలని పని ప్రదేశాల వద్దనే వన్ టైం హజరు తీసుకోవాలని ప్రభుత్వం ను రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశారు.