ఈ నెల 7న శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : శ్రీ అన్నమాచార్య సంగీత నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో, ప్రముఖ గాయకుడు, ఆధ్యాత్మిక వేత్త అన్నమయ్య పవన్ ప్రత్యక్ష నిర్వహణలో ఈ నెల 7న కొంపల్లిలోని హమ్స్ తాన్స్ కన్వెన్షన్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమలలో నిర్వహించే వైఖానస ఆగమ సంప్రదాయ పద్ధతిని అనుసరించి ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల వేద పండితులు, అన్నమయ్య వంశీయులు పాల్గొని ప్రత్యేక...