MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 7:31 pm Posted by : MANA TOLIVELUGU

ఉచిత మెగా హెల్త్ క్యాంప్

ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్ పరిధిలోని ఠాగూర్ హై స్కూల్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దపురం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ అలీవ హాస్పిటల్ సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను వారి నివాస ప్రాంతాలకే తీసుకువచ్చి అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన వందలాది మంది స్థానిక ప్రజలకు అలీవ హాస్పిటల్ నిపుణులైన వైద్య బృందం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముద్దపురం శ్రీకాంత్ గౌడ్ ని, అలీవ హాస్పిటల్ డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని హన్మంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.