MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:17 pm Posted by : MANA TOLIVELUGU

ఉద్యమకారుల భూ పోరాటానికి చలో ఉప్పల్ బాగాయత్ ను విజయవంతం చేయండి  

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి టౌన్ ప్రతినిధి జంగిటి రవీందర్ :

ఉద్యమకారుల భూ పోరాటానికి చలో ఉప్పల్ బాగా యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలకులు, ఉద్యమకారులకు అన్యాయం చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వస్తే తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపునిస్తూ 30 వేల పెన్షన్ ఇస్తూ 250 గజాల ఇళ్ల స్థలాన్నిస్తూ హెల్త్ కార్డులు జారీ చేస్తామని, ఉద్యమకారులకు మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారని అన్నారు. కమిటీ పేరు మీద కాలయాపన చేద్దామని చూస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్.. ఇది న్యాయం కాదని, ఉద్యమకారుల ఉసురు పోసుకోవద్దని ఉద్యమకారులకు అన్ని విధాల న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షుడు, కొడిమాల కృష్ణ, పట్టణ అధ్యక్షులు మల్కాపురం వినోద్, మహబూబ్, ఉద్యమకారులు పాల్గొన్నారు.