ఉద్యమకారుల భూ పోరాటానికి చలో ఉప్పల్ బాగాయత్ ను విజయవంతం చేయండి  

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి టౌన్ ప్రతినిధి జంగిటి రవీందర్ : ఉద్యమకారుల భూ పోరాటానికి చలో ఉప్పల్ బాగా యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలకులు, ఉద్యమకారులకు అన్యాయం చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వస్తే తెలంగాణ ఉద్యమకారులని...