మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలు అందిస్తానని ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న రామిడి గ్రీష్మారెడ్డి తెలిపారు. ప్రముఖ విద్యా సంస్థ అయిన కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో బడంగ్ పేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి రామిడి కవితా రెడ్డి కుమార్తె రామిడి గ్రీష్మారెడ్డి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఘనంగా పట్టాభిషేకం వేడుక గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో కళాశాల ప్రిన్సిపల్, ఆధ్యాపకులు, అతిథులు పాల్గొని విద్యార్థులకు కృషిని అభినందించారు. ఆమెకు పట్టా ప్రధానం చేసిన సందర్భంగా వేదికపై అతిథుల చేతుల మీదగా సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రీష్మారెడ్డిని అభినందించారు. వైద్య విద్య పూర్తి చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఘన విజయంతో రామిడి గ్రీష్మారెడ్డి తల్లిదండ్రులు రామిడి రామ్ రెడ్డి, కవితకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు గర్వకారణంగా నిలిచారు.