ఎంబీబీఎస్ పట్టా అందుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూతురు బీర్ల అరుంధతి
భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ప్రజలకు వైద్య సేవలు అందచేస్తా - డాక్టర్ అరుంధతి మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలు అందిస్తానని ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న బీర్ల అరుంధతి తెలిపారు. ప్రముఖ విద్యా సంస్థ అయిన కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కూతురు బీర్ల అరుంధతి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఘనంగా పట్టాభిషేకం వేడుక గ్రాడ్యుయేషన్ (కాన్వికేషన్) కార్యక్రమం...