ఎన్టీఆర్ నగర్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
బస్తీ దర్బార్లో సమస్యల వెల్లువ ఎల్బీనగర్: ఎన్టీఆర్ నగర్ బస్తీలో నెలకొన్న ఇంటి పట్టాలు, డ్రైనేజీ, వీధిలైట్లు, పారిశుద్ధ్య సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ దర్బార్లో స్థానికులు తమ సమస్యలను వివరించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని రాజు కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.వి. గౌడ్, బాలాపూర్ బాలస్వామి, ఎం. సతీష్, సైదులు యాదవ్, వేణుగౌడ్, వడ్డెర రఘుపతి తదితరులు పాల్గొన్నారు.