MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 8:40 pm Posted by : MANA TOLIVELUGU

ఎప్పటికీ మర్చిపోలేని మహానీయుడు ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, బ్యూరో ప్రతినిధి ముత్తయ్య

పేదలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారని వక్ఫ్ బోర్డ్ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ సమీర్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, అలుపెరుగని కార్యదీక్షపరుడు ఎప్పటికీ మర్చిపోలేని మహానీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ కలిసి ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు‌ ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ చేవెళ్ల ప్రజల ముద్దు బిడ్డగా.. బడుగు బలహీన వర్గాలకు బాసటగా.. నిస్సహాయులకు నీడగా, పేదలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగపాటి నవీన్ , ఉప సర్పంచ్ జోరల రమేష్ , కరొళ్ల చంద్రయ్య ముదిరాజ్ ,పోతర్ల అంబయ్య యాదవ్ , స్వర్ణ గంటి ఆనందం, పిఎసిఎస్ డైరెక్టర్లు పోల్కం బాలయ్య, కాడమోని ప్రభాకర్, వార్డ్ సభ్యులు స్వర్ణగంటి సంజీవ , పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కటికల మహేందర్ ముదిరాజ్ , సున్నం కృష్ణ, ఆవుల కాడి శ్రీశైలం, దుడ్డు కృష్ణ ,పోల్కం కృష్ణయ్య , మీదింటి సురేష్ ,కావలి చంద్రయ్య, కటికల పరమేష్, దయానంద్ , తేల్జెరి శ్రీశైలం, కాకి నాగేష్ ,కటికల శంకర్, తెల్జీరి లక్ష్మయ్య ,గాజుల రాజు, వద్ది శీను, పి చంద్రయ్య, రేవెల్ల రాజలింగం టింగిరికారి రవి తదితరులు పాల్గొన్నారు.