ఎమ్మెల్యే కార్యాలయంపై దాడికి దిగి అద్దాలు పగలగొట్టి, విధ్వంసం సృష్టించడం దుర్మార్గపు చర్య

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య    రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు జరిపిన దాడి అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.   ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావుంటుంది కానీ, భౌతిక దాడులకు కాదని సబితా ఇంద్రారెడ్డి...