మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
నడవలేని వారు ఇతరులపై ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవించడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడానికి ట్రై సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని మాజీ కార్పొరేటర్ యాత పవన్ కుమార్ యాదవ్ అన్నారు. రంగనాయకుల కాలనీకి చెందిన కచేరే సచిన్ ఇటిక సరఫరా చేసే లారీలలో పనికి వెళుతుండేవాడు. ఇటీవల అకస్మాత్తుగా లారం నుంచి కింద పడడంతో నడుము వెన్ను బొక్క విరిగిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న అతనికి మాజీ మంత్రి, స్థానిక మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా మామిడిపల్లి రంగనాయకుల కాలనీకి చెందిన కచేరే సచిన్ కు ట్రై సైకిల్ (బ్యాటరీ సైకిల్) ను మామిడిపల్లి మాజీ కార్పోరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, కామేష్ రెడ్డి అందజేశారు .అనంతరం ఎమ్మెల్యే ఆఫీస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.