MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 3:51 pm Posted by : MANA TOLIVELUGU

ఎల్‌నినోతో ఆయిల్‌పామ్‌ మేలు

సాగు వైపు దృష్టి సారించాలి

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

మన తొలివెలుగు ఉమ్మ‌డి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో రిపోర్ట‌ర్ ఎన్. హ‌రీష్‌ (07 ఆగ‌స్ట్‌2026) :

ఎల్‌నినో వాతావ‌ర‌ణ‌ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ వంటి అధిక లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో రైతు భాను పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మొక్క నాటారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొలాలకు రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు కోరగా.. ఉపాధి హామీ బీవీజీ రామ్‌జీ పథకం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ సుధీర్ రెడ్డి, డీహెచ్‌ఎస్ఓ విజయ్ భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.