ఎస్ఎన్డీపీ నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
వానాకాలంలో వరద నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్ఎన్డీపీ నాలా అభివృద్ధి పనులను అధికారులు త్వరగా పూర్తి చేసి వరద నీటి సమస్య లేకుండా చూడాలని జిల్లెలగూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త, మాదారి రమేష్ కోరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాల మేరకు.. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మీర్‌పేట్ 60వ డివిజన్‌లో జరుగుతున్న వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం పనులను ఆయన మున్సిపల్...