MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 4:43 pm Posted by : MANA TOLIVELUGU

ఎస్‌ఎన్‌డీపీ నాలా పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తా చెదారం, మట్టిని తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్, మీర్‌పేట్ డివిజన్‌లో ఉన్న మిథిలా నగర్‌లో కొనసాగుతున్న ఎస్‌ఎన్‌డీపీ నాలా అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలా పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తా చెదారం, మట్టిని తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అర్కల కామేష్ రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి , ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, రామిడి రామిరెడ్డి, దీప్లాల్ చౌహాన్, దిండు భూపేష్ గౌడ్, సునీత బాలరాజ్, లావణ్య, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గీతా, బిందు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.