ఎస్‌ఎన్‌డీపీ నాలా పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తా చెదారం, మట్టిని తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్, మీర్‌పేట్ డివిజన్‌లో ఉన్న మిథిలా నగర్‌లో కొనసాగుతున్న ఎస్‌ఎన్‌డీపీ నాలా అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన...