MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 8:27 pm Posted by : MANA TOLIVELUGU

ఎస్.ఆర్ నాయక్ నగర్ లో మన్నె రాజు పర్యటన 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

సాయిబాబా నగర్ డివిజన్ ఎస్.ఆర్ నాయక్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో సీసీ రోడ్లు మరియు ఇతర సమస్యలను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు పరిశీలించారు. అక్కడి నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ లను పూర్తిగా పరిశీలించిన మన్నె రాజు సీసీ రోడ్ల నిర్మాణం మరియు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, జనప్రియ అపార్ట్‌మెంట్స్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు మరియు స్థానిక నివాసితులు తదితరులు పాల్గొన్నారు.