MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:24 pm Posted by : MANA TOLIVELUGU

ఒక్క బండరాయి దొర్లినా.. ప్రాణాలు హరీ..!

ఇంజాపూర్ రోడ్డులో నిత్యం ప్రమాదకరంగా దూసుకెళ్తున్న వందలాది టిప్పర్లు

నంబర్ ప్లేట్ ఉండదు.. వెనక భాగంలో డోర్ ఉండదు.

ఆర్టీఏ, పోలీస్, ఇరిగేషన్ అధికారులకు ముడుపులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు..!

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ – తొర్రూర్ రోడ్డులో టిప్పర్లు  ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి. పెద్ద పెద్ద బండ రాళ్లను గత కొద్ది రోజుల నుంచి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా డ్రైవర్లు కనీస జాగ్రత్తలు తీసు కోకపోడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు రహదారులపై నడవడం, వాహనాల వెనుక భాగం డోర్లు కూడా లేకపోవడంతో బండ రాళ్లు రోడ్డుపై పడి ఆ సమయంలో అటువైపు ప్రయాణించే పాదాచారులు గాని, వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వాహన యజమానులు పట్టించుకోవడం లేదనే స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఏ, పోలీస్ అధికారులు స్పందించి అప్పుడప్పుడు ప్రధాన రహదారులపై కాకుండా గ్రామాలలో వెళ్లే రహదారిలో కూడా చెక్ చేస్తే ఇలాంటి ప్రమాదకర వాహనాలను పట్టుకొని సీజ్ చేయవచ్చు. దీంతో ప్రమాదకరమైన టిప్పర్ల ప్రయాణం నుంచి ప్రజలను రక్షించవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రమాదకరంగా ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.