ఒక్క బండరాయి దొర్లినా.. ప్రాణాలు హరీ..!

ఇంజాపూర్ రోడ్డులో నిత్యం ప్రమాదకరంగా దూసుకెళ్తున్న వందలాది టిప్పర్లు నంబర్ ప్లేట్ ఉండదు.. వెనక భాగంలో డోర్ ఉండదు. ఆర్టీఏ, పోలీస్, ఇరిగేషన్ అధికారులకు ముడుపులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు..! మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ - తొర్రూర్ రోడ్డులో టిప్పర్లు  ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి. పెద్ద పెద్ద బండ రాళ్లను గత కొద్ది రోజుల నుంచి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా డ్రైవర్లు కనీస జాగ్రత్తలు తీసు కోకపోడం, నెంబర్ ప్లేట్ లేకుండా...