ఓటు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన సిల్వేరి సాంబశివ మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (30 జూలై 2026) : ప్రతి ఒక్క ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారంను పూర్తిగా, సరైన వివరాలతో నింపి సంబంధిత బీఎల్ఓల కు తప్పనిసరిగా అందజేయాలని లేనిపక్షంలో ఓటరు జాబితా నుండి పేరు తొలగించబడే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సిల్వేరి సాంబశివ తెలిపారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ 62వ డివిజన్, బూత్ నంబర్లు 310, 311, వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో...