కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు తోట అరవింద్ రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాదర్ గూల్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు తోట అరవింద్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డికి కేఎల్ఆర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట అరవింద్ రెడ్డి...