కాడెద్దులతో నిరసన
మన తొలివెలుగు, ఇబ్రహీంపట్నం ప్రతినిధి సీహెచ్ రాజు : పదిహేను ఏళ్లుగా భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ రైతు కాడెద్దులతో పాటు నాగలిని తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినూత్నంగా నిరసన తెలిపిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చర్చనీయాంశమైంది. మొగుళ్లవంపు గ్రామానికి చెందిన బత్తైన పాండురంగారెడ్డి తనకు రావాల్సిన 3 ఎకరాల భూమిని తన పేరుతో ఆన్లైన్ లో నమోదు చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని 15 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన...