మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మహేశ్వరం నియోజకవర్గo పరిధిలోని కందుకూరు, మహేశ్వరం మండలాలలో మంఖాల్, ఫ్యాబ్ సిటీ, హార్డ్వేర్ పార్క్, ఎయిర్పోర్ట్ గేట్, తుక్కుగూడ, దేవేందర్ నగర్ కాలనీ లలో ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ లతో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. డీజేతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. దత్తు నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మగల రాజు దేవేంద్ర గౌడ్, యాదగిరి, బ్రహ్మచారి, సాయి చంద్రశేఖర్, శ్రీరాములు, రమేష్, భాస్కర్, సాంసంగ్, యాదగిరి, రాజు, యాదయ్య లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణలు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 140 సంవత్సరాల క్రితం అమరవీరుల రక్త తర్పణం వల్ల వేలాదిమంది కార్మికుల బలిదానాలతో ఏర్పడిన మేడే స్ఫూర్తితో ఈనాటి కార్మిక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న అనాలోచితం విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కొడ్ లు తీసుకొచ్చిందని కార్మికులకు పని గంటల భారం అదనంగా పడుతుందని కార్మికుల హక్కులని కాలరాస్తుందని తెలిపారు. కార్మికులకు స్వేచ్ఛ లేకుండా చేస్తుందని విమర్శించారు, మేడే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేసి మన హక్కులు సాధించుకోవాలని కార్మికులకు వారు పిలుపునిచ్చారు