మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తే దేశం ప్రగతి పథంలో ముందుకు వెళుతుందని తొలి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పీసీసీ కార్యదర్శి యేల్మేటీ అమరేందర్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్ డివిజన్ 62 లో అడ్వాన్స్డ్ రీసర్చ్ సెంటర్ వద్ద వద్ద మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి శ్రమ వెలకట్టలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో. వంగేటి మధుసూదన్ రెడ్డి,సుధాకర్ అశోక్, అంజయ్య, యాదగిరి ,మల్లేష్, యశోద, తదితరులు పాల్గొన్నారు