MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:30 pm Posted by : MANA TOLIVELUGU

కార్మిక చట్టాలు అమలు చేయాలి – సీఐటీయూ 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్ :

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దశలవారి పోరాటాల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేసి ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంట్ సంతోష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని, అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు కార్మికులకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఏళ్ల తరబడిగా పట్టణాలలో ప్రజలకు అందుబాటులో ఉండి డ్రైనేజీ, రోడ్లు శుభ్రం చేస్తూ సమయానికి వాటర్ అందిస్తూ లైట్ వేస్తూ బిల్లులు వసూలు చేస్తూ పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కాకుండా పెట్టి చాకిరి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాలు ధరలకు అనుగుణంగా కనీస వేతనం సుప్రీంకోర్టు చేసిన నిర్ణయం ప్రకారంగా చెల్లించాలని, కాంట్రాక్టు ఏజెన్సీ పేర్లను తొలగించి కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ గ్రాడ్యుటి పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇందిరమ్మ ఇండ్లలో ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ ప్రాధాన్యత మున్సిపల్ కాంటాక్ట్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రామచందర్, వెంకటేశం, బిక్షపతి, రవి, వరమ్మ, యాదమ్మ, రేణుక, కిష్టమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.