కాలనీలలో అభివృద్ధి డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : కాలనీ, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముగింపు పలికి భవిష్యత్తులో డ్రైనేజీ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి పనులు నిరాటకంగా కొనసాగిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ సర్కిల్ 57వ డివిజన్ నాదర్ గూల్, అల్మాస్ గూడ ప్రాంతంలోని స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఆమె సావధానంగా విని కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న...