MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:53 pm Posted by : MANA TOLIVELUGU

కీసరి అంజయ్యకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బీఆర్ఎస్ పార్టీ నాయకులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : 

మంఖల్ లో దివంగత కీసరి అంజయ్య మృతిపట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సతీమణి పుష్పమ్మ ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో అంజయ్య అన్న కుమారుడు తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ సామెల్ రాజ్, రాజు, ప్రణయ్ కుటుంబ సభ్యులు, కుమార్తెలు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు వెంకటరాజ్ రెడ్డి, వెంకటేష్, నాసరఖాన్ సుధాకర్ గౌడ్, కుమార్ సాగర్, శ్రీకాంత్ సాగర్, ప్రవీణ్, అన్వేష్, జోసెఫ్ విష్ణు తదితరులు హాజరై అంజయ్య కి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.