MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 11:45 pm Posted by : MANA TOLIVELUGU

కుక్కదువ్వు అంజన్న మరణం సీపీఎం పార్టీకి తీరని లోటు 

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

వామపక్ష ఉద్యమాలకు తన ప్రింటింగ్ ప్రెస్ ద్వారా నిరంతర సహకారం అందించిన కుక్కదువ్వు అంజన్న మరణం సీపీఎం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విచారం వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణ వాస్తవ్యులు, హనుమాన్ వాడకు చెందిన కుక్క దువ్వు అంజన్న లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ వ్యవస్థాపకులుగా వామపక్ష ఉద్యమాలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ తోపాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు సంతాపాన్ని తెలియజేస్తూ వారి పార్టీ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆశ సాధన కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.