కుక్క కాటు నివారణపై జీహెచ్‌ఎంసీ అవగాహన కార్యక్రమం

చిన్నారులకు కరపత్రాల పంపిణీ మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పూల్ బాగ్ క్రీడ మైదానంలో కుక్క కాటు నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు వీధి కుక్కలతో మెలిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చిన్నారులకు కుక్క కాటు నివారణ, ప్రథమ చికిత్స, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కుక్కలు కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో...