MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 7:36 pm Posted by : MANA TOLIVELUGU

కుటుంబ సలహా కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరిలో సెంటర్ ను ప్రారంభించిన భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

మన తొలివెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

 

కుటుంబ సలహా కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. శనివారం డీఆర్డీఎ-సెర్ప్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబ సలహా కేంద్రం (జెండర్ రిసోర్స్ సెంటర్) ను మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలు, మహిళల హక్కులు, లింగ వివక్ష, గృహ హింస, ఆరోగ్యం, పోషకాహారంపై ఉచితంగా న్యాయ, మానసిక సలహాలు అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మండల స్థాయి సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుందని, బాధితులు నేరుగా వచ్చి సేవలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ యాసిన్, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవో దినకర్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రసాల శిరీష, కార్యదర్శి ఏదునూరి వాణి, కోశాధికారి కవిత, ఏపీఎం పాశికంటి మల్లేశం, సీసీలు అఫ్సర్, అలివేలు, మల్లేష్, కవిత, అకౌంటెంట్ పుష్ప, జీఆర్సీ సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు చొక్కా కుమారి, తిరుమల, సత్యలక్ష్మి, అంజమ్మ, మౌనిక, కవిత పాల్గొన్నారు.