బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్ లోని బీరప్ప కామరాతి దేవాలయం సమీపంలో కురుమ సంఘం సామాజిక భవన నిర్మాణ పనులను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ పరిశీలించగా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కురుమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ మాట్లాడుతూ.. గత 12 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పలు సామాజిక భవనాలను నిర్మించామని, కురుమ సంఘం సామాజిక భవనం పనులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలోనే మిగిలిపోయిన పనులను పూర్తిచేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అంతకు ముందు బీరప్ప స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు నార్ల కంటి బాలయ్య, మాజీ అధ్యక్షులు చంద్రయ్య, చైర్మన్ బి.నరసింహ, పెద్ద కురుమ జి.యాదయ్య సెల్వోజి జి. సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు సాయి కుమార్, నార్లకంటి రామకృష్ణ, ఉపాధ్యక్షులు వి. యాదగిరి, చంద్రశేఖర్, ఈకే. శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి మహేందర్, సంయుక్త కార్యదర్శి ఎన్.శంకర్, కోశాధికారి ఎన్. జగదీష్ కుమార్, వైస్ చైర్మన్ బాలరాజు, మల్లేష్, సలహాదారులు ఎన్. నాగేష్, ఎన్.పెంటయ్య, కె. అంజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.వేణు, కుల బాంధవులు నార్ల కంటి నరసింహ, నార్ల కంటి కుమార్, నార్ల కంటి ఎట్టయ్య, విష్ణు, బీరప్ప నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్, కాలనీవాసులు వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణారెడ్డి, బాల మల్లేష్, కె. నిరంజన్, ఎన్. అశోక్, కె.చంద్రయ్య, జీడిమెట్ల డివిజన్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.