కేఎల్ఆర్ కు అద్భుత చిత్రపటం బహుకరణ

బాలాపూర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి బాలాపూర్ కాంగ్రెస్ నేతలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ప్రత్యేకంగా తయారు చేయించిన అద్భుత చిత్రపటాన్ని తుక్కుగూడ కార్యాలయంలో బహూకరించారు. శ్రీ రామలింగేశ్వర దేవాలయం ఛైర్మన్ టేకుల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో చిరునవ్వు చిందుస్తూ గీసిన కేఎల్ఆర్ భారీ చిత్రపటాన్ని ఆత్మీయంగా సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వాచనం అందించారు. ఈ సందర్భంగా కిచ్చెన్న బాలాపూర్ నేతల ఆత్మీయతకు ధన్యవాదాలు...